పుట్టిన రోజున విడుదలైన చిరంజీవి ఏకైక సినిమా ఏంటో తెలుసా?
TV9 Telugu
22 August 2024
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి రికార్డులు, ఘనతల గురించి చెప్పడానికి ఏముంది. ఆయన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో.
అయితే మెగాస్టార్ చిరంజీవి గురించి ఇప్పటివరకు చాలామందికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయం మాత్రం గురించి మాట్లాడుదాం.
సాధారణంగా చిరంజీవి పుట్టినరోజు అంటే కొత్త సినిమా ప్రారంభోత్సవం లేదంటే సెట్స్ పై ఉన్న మూవీ అప్‌డేట్స్ మాత్రమే ఎక్కువగా వస్తుంటాయి
అయితే ఇన్నేళ్ల సినిమా కెరీర్‌లో తన పుట్టినరోజునే ఒకేఒక్క సినిమా రిలీజ్ ను చేశారు మెగాస్టార్ చిరంజీవి. అదే 'చంటబ్బాయ్'
1986లో రిలీజైన చంటబ్బాయ్ సినిమా జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. దీంతో చిరంజీవి బాగా డిసప్పాయింట్ అయ్యారట.
ఈ క్రమంలోనే తన పుట్టినరోజున సినిమా పోస్టర్, టీజర్, సాంగ్స్ లేదా ప్రారంభోత్సవం లాంటివి మాత్రమే చేస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి.
ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తోన్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి
ఇక్కడ క్లిక్ చేయండి..