విశ్వక్ సేన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మొదటి సినిమా అదే..
Phani.ch
23 May 2024
విశ్వక్ సేన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.. తెలుగు ఒక మంచి మాస్ హీరోగా దూసుకెళ్ళిపోతున్నాడు.
వెళ్ళిపోమాకే సినిమాతో నటుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ నగరానికి ఏమైంది సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారట.
తర్వాత హిట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. విశ్వక్సేన్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయాడు ఇప్పుడు.
అయితే ఒక ఇంటర్వ్యూ లో తనమొదటి సినిమా వెళ్ళిపోమాకే అని అనుకుంటారు.. కానీ అది కాదు తను చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై కనిపించానని చెప్పి ఆశ్చర్యపరిచాడు.
తనకి అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలని అనుకున్నారని కానీ సెలెక్ట్ అవ్వలేదని తెలిపాడు విశ్వక్ సేన్.
అయితే దాసరి నారాయణరావు నిర్మాతగా తీస్తున్న ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం చూస్తున్న సమయంలో ఆడిషన్స్ కి వెళ్లి సినిమాకి సెలెక్ట్ అయ్యాడట.
ఆ సినిమా పేరే 2009 లో వచ్చిన బంగారు బాబు. ఈ సినిమాలో జగపతిబాబు మీరాజాస్మిన్ హీరో హీరోయిన్లు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
ఆ సినిమాలో విశ్వక్సేన్ సీన్ ని ఒక్కరోజులోనే షూట్ చేశారట. అయితే ఈ సినిమాలో విశ్వక్సేన్ చిన్నతనంలో హీరోని చెడగొట్టే స్నేహితుల
్లో ఒకడిగా కనపడ్డాడు.
ఇక్కడ క్లిక్ చేయండి