28 November 2024
20 ఏళ్లైకే తల్లైంది.. రెండు పెళ్లిళ్లు.. రెండుసార్లు విడాకులు..
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై సత్తా చాటుతోంది శ్వేతా తివారి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలన్నింటి కంటే ఎక్కువగా ఆమె పారితోషికం తీసుకుంటుంది.
హిందీలో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన సీరియల్ ‘కసౌటి జిందగీ కె’ సీరియల్ ద్వారా నార్త్‌లో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇందులో ప్రేరణ శర్మ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది శ్వేతా తివారి. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది ఈ హీరోయిన్.
శ్వేతా తివారి సినీ రంగుల జీవితం ఎంతో విజయవంతంగా సాగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నోసార్లు ఒడిదుడుకులు ఎదుర్కొంది.
రెండుసార్లు ప్రేమలో మోసపోయింది. శ్వేతా తివారి 1998లో నటుడు రాజా చౌదరిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పాలక్ తివారి జన్మించింది.
మనస్పర్థలతో 2007లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. వీరికి రేయాన్ష్ కోహ్లీ జన్మించాడు.
కానీ కొన్నిరోజులకే తన భర్త గృహ హింసకు పాల్పడుతున్నాడని 2019లో కోర్టును ఆశ్రయించి అదే ఏడాది విడాకులు తీసుకుంది శ్వేతా తివారీ.
నివేదికల ప్రకారం శ్వేతా తివారీ ఆస్తులు రూ.81 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్