18 January 2025

13 ఏళ్లు పెద్ద నటుడితో డేటింగ్.. ఒక్క ఎపిసోడ్‏కు లక్షలు తీసుకుంటుంది

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై చాలా మంది హీరోయిన్స్ ప్రజల హృదయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. 

ఆమె డాక్టర్ కావాలనుకుంది. చిన్నప్పటి నుంచే చదువులో ఫస్ట్ ఉండేది. ఆ తర్వాత జీవితంలో ఎదురైన సంఘటనలు ఆమెను మార్చేశాయి.

నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనుకోకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఆమె మరెవరో కాదు. బుల్లితెర పై యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయిన నైరా.. అలియాస్ శివంగి జోషి. 

తాను కొరియోగ్రాఫర్‌గా మారాలనుకుంటున్నానని ఇంటర్వ్యూలో చెప్పింది. 9వ తరగతిలోనే నటిగా బుల్లితెరపై నటన జీవితాన్ని స్టార్ట్ చేసింది. 

ఆ తర్వాత యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్ ద్వారా ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రస్తుతం ఆమె నటుడు కుశాల్ టాండన్‏తో ప్రేమలో ఉందట. 

కుశాల్ ఆమె కంటే 13 సంవత్సరాలు పెద్దవాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుశాల్ తాను శివంగితో ప్రేమలో ఉన్నట్లు అంగీకరించాడు. 

శివంగి జోషి నికర విలువ రూ.37 కోట్లు. నివేదికల ప్రకారం శివంగి ఒక్క ఎపిసోడ్ కోసం రూ.1.5 లక్షలు పారితోషికం తీసుకుంటుందట.