42 ఏళ్ల వయసులో తగ్గని అందం.. త్రిష డైట్ సీక్రెట్ ఇదేనట..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం దక్షిణాదిలో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది త్రిష. 42 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.
ఇన్నాళ్లు తమిళంలో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే. 42 ఏళ్ల వయసులోనూ త్రిష అందం ఏమాత్రం తగ్గలేదు. అలాగే ఫిట్నెస్ విషయంలోనూ కుర్ర భామలకు గట్టిపోటీనిస్తుంది ఈ అందాల వయ్యారి.
తాజాగా ఈ బ్యూటీ ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసింది. ఆమె ఉదయం లేవగానే గ్రీన్ టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు తీసుకుని తన రోజును స్టార్ట్ చేస్తుందట.
అలాగే వ్యాయమం, యోగ రోజూ చేయడంతోపాటు ఆహారంలో నారింజ వంటి సిట్రస్ పండ్లను తీసుకుంటుందట. విటమిన్ సి ఎక్కువగా ఉండేలా చూసుకుంటుందట.
త్రిష ఎక్కువగా సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. షూటింగ్స్ తర్వాత తన మనసులు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కార్డియో వ్యాయమాలను చేస్తుందట.
అలాగే ఎక్కువగా యోగా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, తన శరీరాన్ని టోన్ గా మార్చేందుకు యోగాతోపాటు శరీరానికి అవసరమైన వర్కవుట్స్ చేస్తుందట ఈ అమ్మడు.
ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ త్రిష తన నిద్రకు ప్రాధాన్యత ఇస్తుంది. తనను ఉత్సాహంగా ఉండేందుకు రోజుకూ 8 గంటలు నిద్రపోవడానికి ట్రై చేస్తుందట.