11 July 2025
41 ఏళ్ల వయసులో ఈ దూకుడు ఏందీ అమ్మడు.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా..
Rajitha Chanti
Pic credit - Instagram
దాదాపు 20 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది ఈ బ్యూటీ.
ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది. చేతినిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లుగా ఫోటీగా దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ త్రిష. తెలుగుతోపాటు తమిళంలోనూ ఇప్పుడు అగ్ర హీరోలకు జోడిగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ హీరోయిన్. ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే.
అలాగే కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రలలో నటించిన తగ్ లైఫ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.
అయితే ఇప్పుడు త్రిష ఒక్కో సినిమాకు రూ.1 కోటి నుంచి రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయినా ఆఫర్స్ తగ్గడం లేదు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, తమిళంలో సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తుంది ఈ బ్యూటీ.
అలాగే సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. 41 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్