12 September 2025

పేరుకే సీరియల్ బ్యూటీ.. 23 ఏళ్ల వయసులో 250 కోట్ల ఆస్తులు.. ఎవరంటే

Rajitha Chanti

Pic credit - Instagram

ఇప్పుడు చాలా మంది సీరియల్ తారలు హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే రెమ్యునరేషన్ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. 

ప్రస్తుతం ఓ సీరియల్ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఆమెకు ఏకంగా స్టార్ హీరోహీరోయిన్లకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. 

అలాగే స్టార్ హీరోలకు మించిన ఆస్తులు ఉన్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె వయసు 23 సంవత్సరాలు మాత్రమే. అయినా ఆస్తులు రూ.250 కోట్లకు పైనే. 

ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటి ఆమె. ఆ సీరియల్ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ ఫేమస్ బ్యూటీ నటి జన్నత్ జుబేర్ 

చిన్న వయసులోనే తెరంగేట్రం చేసి తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

నెట్టింట ఓ రేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ విషయంలో ఏకంగా షారుఖ్ ఖాన్ ను బీట్ చేసింది. ఆమెకు ఇన్ స్టాలో 49.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

టీవీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. సీరియల్స్ ద్వారా అలరించిన ఈ అమ్మడు సినిమల్లో అవకాశాలు అందుకుంటుంది. 

ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే.. అంతగా నెట్టింట ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది.