01 March 2025

ప్రతి సంవత్సరం రూ.30 కోట్లు విరాళం ఇస్తున్న టాలీవుడ్ హీరో.. ఎందుకంటే

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతడు ఓ స్టార్ హీరో. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ హీరో.

ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే. 

సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న తన కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు ఈ సూపర్ స్టార్. 

ఇప్పటివరకు 40కి పైగా చిత్రాల్లో నటించిన మహేష్ బాబు.. ప్రతి సంవత్సరం పేద ప్రజల చిన్నారుల కోసం రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిస్తే షాకవుతారు. 

మహేష్ బాబు ఆస్తులు రూ.135కోట్లు. హైదరాబాద్ లో ఆయన ఉంటున్న నివాసం విలు రూ.30 కోట్లు. అలాగే రూ.7 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉంది. 

మహేష్ బాబు అనేక NGOలతో కలిసి పనిచేశాడు. ఆయన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించాడు. 

అలాగే రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. . రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య సౌకర్యాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను ఆయన కల్పించారు.

1979లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు, దశాబ్దం పాటు అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. 1999లో హీరోగా మారారు.