09 May 2025
సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.. ఎన్ని హిట్స్ మిస్సైందంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
న్యాచురల్ స్టార్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అద్భుతమైన నటనతో మెప్పించింది.
ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీతారలు ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
2015లో ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించింది.
ఇటీవలే తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది ఈ న్యాచురల్ బ్యూటీ.
అయితే నిత్యం కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంపిక చేసుకుంటుంది. ఇప్పటివరకు అనేక చిత్రాలు రిజెక్ట్ చేసింది.
కంటెంట్ నచ్చకపోతే ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలను సైతం సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. అలాగే కోట్లు విలువైన యాడ్స్ సైతం రిజెక్ట్ చేసింది.
విజయ్ నటించిన లియో, కార్తి నటించిన కారు వెలియడై, విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్, మహేష్ బాబు సర్కారు వారు పాట చిత్రాలు.
అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన కన్నుమ్ కన్నుమ్ కొల్లియాదితాల్ సినిమాతోపాటు చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రాలను రిజెక్ట్ చేసిందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్