21 September 2025

5 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు..

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఓ సంచలనం. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా.. లేదా గ్లామర్ రోల్స్ అయినా తనదైన నటనతో బాక్సాఫీస్ షేక్ చేస్తుంది

తెలుగు సినిమా ప్రపంచంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోలతోపాటు భారీ ఫాలోయింగ్ ఉంది. 

ఒకప్పుడు 5000 జీతానికి స్కూల్లో టీచర్ గా పనిచేసిన ఆమె.. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. 

 ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమై తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. 

తెలుగు, తమిళంలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించిన అనుష్క.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. 

కానీ ఈ మూవీ తర్వాత ఆమె సైలెంట్ అయ్యింది. ఎప్పుడో ఒక సినిమా చేస్తూ జనాల ముందుకు వస్తుంది. ఇటీవలే ఘాటి సినిమాలో నటించింది. 

 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. మాస్ యాక్షన్ డ్రామాలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది అనుష్క. 

అనుష్క సినిమాల్లోకి రాకముందు బెంగళూరులోని ఈస్ట్‌వుడ్ స్కూల్‌లో యోగా టీచర్‌గా పనిచేసింది. అప్పుడు ఆమెకు నెలకు రూ.5000 జీతం.