29 December 2024

ఈ ఏడాది కుర్రకారును ఆగం చేసిన హీరోయిన్.. తెగ సెర్చ్ చేశారట..

Rajitha Chanti

Pic credit - Instagram

ఈ ఏడాది కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందట ఓ హీరోయిన్. అవును.. ఈ సంవత్సరం మొత్తంలో ఆమె కోసం గూగుల్‏లో తెగ వెతికారట. 

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఆ సినిమాలో ఆమె చిన్న పాత్రే పోషించింది. 

కానీ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆ ఒక్క మూవీ కెరీర్ టర్న్ చేసింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ త్రిప్తి డిమ్రి. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. యానిమల్ సినిమాతో మెప్పించింది. 

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇందులో రష్మిక, రణబీర్ ప్రధాన పాత్రలు పోషించారు. 

ఈ మూవీలో కీలక పాత్రలో త్రిప్తి డిమ్రీ కూడా నటించింది. ఇందులో ఆమె కనిపించింది కొంత సేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది త్రిప్తి. దీంతో ఈ అమ్మాడి పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. 

ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఈ ఏడాది ఈ బ్యూటీ కోసం గూగుల్ లో నెటిజన్స్ తెగ గాలించారట. మోస్ట్ గూగుల్ సెర్చ్‏డ్ హీరోయిన్.