30 November 2024

చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్.. అయినా ఈ హీరోయిన్‏కు ఆఫర్స్ లేవు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటివరకు చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. 

కానీ ఈ అమ్మడుకు ఆఫర్స్ కరువయ్యాయి. ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుని అవకాశాలకు దూరమైన హీరోయిన్ ఎవరో కాదు.. ప్రియాంక జవాల్కర్. 

 విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే క్రేజ్ సొంతం చేసుకుంది. 

తొలి చిత్రంతోనే బాగా ఫేమస్ అయిన ఈ  బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. దీంతో ఆడపాదడపా చిత్రాల్లో నటించి మెప్పించింది.

అనంతపురంకు చెందిన ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. 

ఆ తర్వాత కిరణ్ అబ్బవరం సరసన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరో హిట్ అందుకుంది. వరుస హిట్స్ వచ్చిన ఆఫర్స్ రాలేదు.

ఇటీవలే టిల్లు స్క్వేర్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అందం, అభినయంతో మెప్పించిన ఈ అమ్మడుకు సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. 

వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ అమ్మడుకు ఆఫర్స్ మాత్రం రావట్లేదని అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకున్నాయి.