10 February 2025
ఫస్ట్ మూవీతోనే రూ.100 కోట్లు కలెక్షన్స్.. చివరకు ఇలా..
Rajitha Chanti
Pic credit - Instagram
తొలి సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది ఈ హీరోయిన్. కుర్రకారు హృదయాలను దొచేసింది ఈ ముద్దుగుమ్మ.
ఆమె నటించిన ఫస్ట్ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆఫర్స్ కోసం చూస్తుంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. కృతి శెట్టి. డైరెక్టర్ బుచ్చిబాబు, వైష్ణవ్ తేజ్ కాంబోలో వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. అందులో రెండు హిట్టయ్యాయి.
కానీ ఆ తర్వాత కృతి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమెకు నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది.
ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్న కృతి.. తెలుగులో సరైన ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే స్పెషల్ సాంగ్ కోసం రెడీ అయ్యిందట.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కృతి శెట్టి త్వరలోనే తెలుగులో రాబోతున్న ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్