13 September 2025

ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.. హీరోతో డేటింగ్ అన్నారు.. ఇప్పుడు ఇలా

Rajitha Chanti

Pic credit - Instagram

ఈ అమ్మడు కెరీర్ తొలినాళ్లల్లో బాడీ షేమింగ్స్ కామెంట్స్ ఎదుర్కొంది. ఎన్నో అవమానాలు భరించి ఆత్మవిశ్వాసంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 

మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది. ముఖ్యంగా ఫస్ట్ మూవీలోనే ముద్దు సీన్లలో రెచ్చిపోయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. 

 ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి. కాలేజీ రోజుల్లో ఢీగ్లామరస్.. ఇప్పుడు కుర్రాళ్లకు గ్లామర్ డాల్ ఈ అమ్మడు.

బ్యాచిలర్ సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే జీవి ప్రకాష్ తో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. 

ఆ తర్వాత అదే హీరోతో కింగ్ స్టన్ సినిమాలో నటించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ దక్షిణాదిలో రూమర్స్ తెగ హల్చల్ చేశాయి.

అయితే తన గురించి వస్తున్న రూమర్స్ నిజం కాదని ఖండించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన నటిస్తుంది. 

ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంది ఈ బ్యూటీ. 

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో నాలుగైదు సినిమాల వరకు ఉన్నాయి. ఒకప్పుడు అందంగా లేదని ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు.