10 November 2025

చేసింది 6 సినిమాలు.. 5 అట్టర్ ప్లాప్.. గ్లామర్ షోతో రచ్చ..

Rajitha Chanti

Pic credit - Instagram

అందం, అభినయంతో మెప్పించినప్పటికీ చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో సరైన క్రేజ్ అందుకోలేకపోతున్నారు. దీంతో తక్కువ సమయంలో ఫేడౌట్ అయిపోతారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినదే. చేసిన సినిమాలన్నీ నిరాశపరిచినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు.

ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే క్రేజీ హీరోయిన్ కేతిక శర్మ. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. 

ఫస్ట్ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో సినిమాల్లో నటించినప్పటికీ ఈ మూవీస్ ప్లాప్ అయ్యాయి.

ఇటీవలే సింగిల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. దీంతో కేతిక ఖాతాలో హిట్టు పడింది.

అయితే అంతకు ముందు కేతిక నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సినిమాలు ఏవి లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది. సినిమాలు అట్టర్ ప్లాప్ అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.