10 December 2024

17 ఏళ్లకే బాడీ షేమింగ్ కామెంట్స్.. నెట్టింటిని హీటెక్కిస్తోన్న బ్యూటీ

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగుల ప్రపంచంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. కానీ ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొని స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. 

సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలిచింది. ఇప్పటికీ ఆమె పర్సనల్ లైఫ్ నెట్టింట హాట్ టాపిక్. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శిల్పా శెట్టి.

కెరీర్ ప్రారంభంలో ఆమె ముదురు రంగులో చాలా సన్నగా ఉండడంతో ఎంతో మంది అవమానించారట. 17 ఏళ్ల వయసులోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ హీరోయిన్. 

కానీ అదే సమయంలో బాడీ షేమింగ్స్ కామెంట్స్ వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోస్ కారణంగా సినిమాల్లో అవకాశం వచ్చిందట. 

సినీ ఫ్యాషన్ ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత తనకు వరుస ఆఫర్స్ వచ్చాయని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదని గతంలో చెప్పుకొచ్చింది శిల్పా శెట్టి.

కెరీర్ తొలినాళ్లల్లో తనను కారణం లేకుండానే సినిమాల్లో నుంచి తప్పించారని.. ఎన్నోసార్లు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదని తెలిపింది. 

తన జీవితంలో ఎన్నో హెచ్చు తగ్గులు, మరెన్నో భయానక క్షణాలు ఉన్నాయని.. అనేక విమర్శలు తర్వాత పట్టుదల, ఆత్మవిశ్వాసం తనను నటిగా మార్చాయని తెలిపింది. 

ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో శిల్పా శెట్టి ఒకరు. అలాగే వందల కోట్లకు యజమాని. రూ.100 కోట్ల విలువైన బంగ్లాతోపాటు ఆస్తులు కలిగి ఉంది.