06 June 2025

ఆ హిట్ మూవీలో సైడ్ డ్యాన్సర్.. కట్ చేస్తే.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో 7/జీ  బృందావన్ కాలనీ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఇందులో ఓ పాటలో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించింది  ఓ అమ్మాయి. 

కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఆ బ్యూటీ టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. 

ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. 

కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మీ కళ్యాణం సినిమాతో కథానాయికగా మారిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా దశాబ్దంపాటు సౌత్ ఇండస్ట్రీని వరుస చిత్రాలతో ఏలేసింది. 

కాజల్ హీరోయిన్ కాకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అదే సమయంలో 7/జీ చిత్రంలో సైడ్ డ్యాన్సర్ గా కనిపించింది కాజల్. 

కాజల్ హీరోయిన్ కాకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అదే సమయంలో 7/జీ చిత్రంలో సైడ్ డ్యాన్సర్ గా కనిపించింది కాజల్. 

తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన కాజల్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది. 

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ వయ్యారి సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది.  తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో సహయ నటిగా కనిపిస్తుంది.