24 November 2025

బోల్డ్ మూవీస్.. గ్లామర్ రోల్స్.. అయినా రానీ ఆఫర్స్.. ఈ బ్యూటీ ఎవరంటే

Rajitha Chanti

Pic credit - Instagram

సాధారణంగా సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. వరుస సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ డమ్ అందుకోని తారలు చాలా మంది ఉన్నారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలతోనే యూత్ ఫేవరేట్ హీరోయిన్‏గా మారిపోయింది. అయినా ఆఫర్స్ కరువే. 

తెలుగులో దాదాపు 12 సినిమాల్లో నటించింది. కానీ అందులో రెండు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఇప్పటివరకు స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. 

ఆమె మరెవరో కాదండి..టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తెలుగులో దాదాపు 12 సినిమాల్లో నటిస్తే.. అందులో కేవలం రెండు సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి. 

యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి.

ఎన్టీఆర్: కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం వంటి చిత్రాల్లో నటించగా.. ఇందులో ఒక్కటే హిట్టయ్యింది.

మంగళవారం సినిమా మాత్రమే హిట్ కాగా.. ఆ తర్వాత ఆమెకు అంతగా ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటూ సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. 

అంతేకాదు.. నిత్యం గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేసినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం రావడం లేదు. కన్నడ, పంజాబీలో సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు.