04 July 2025

చదివింది ఇంటర్.. ఇండస్ట్రీని ఏలేసింది.. క్రేజీ మాత్రం పీక్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తమదైన ముద్ర వేస్తుంటారు. అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. 

ఇంటర్ చదువు ఆపేసి సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ ప్రశంసలు అందుకుంది. 

కానీ ఇటీవల ఆమె నటించిన ఓ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. 

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ ఆదా శర్మ. 

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అమాయకత్వంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ బ్యూటీ. 

ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గానూ పలు సినిమాల్లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. 

లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది. కేరళ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అలాగే వివాదాల్లోనూ చిక్కుకుంది. 

హిందీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. నెట్టింట బిజీగా ఉంటుంది.