05 February 2025
3 సినిమాలు 100 కోట్లు కలెక్షన్స్.. ఈ హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా..
Rajitha Chanti
Pic credit - Instagram
సౌత్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో మొదటి సినిమా చేస్తుంది.
తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.
అంతేకాదు..మూడు సినిమాలు వరుసగా రూ.100 కోట్లు కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
ఇప్పటివరకు ఆమె నటించిన మూడు సినిమాలో థియేటర్లలో విడుదలై రూ.100 కోట్లు రాబట్టాయి. ఆమె మరెవరో కాదు మాళవిక మోహనన్.
కేరళలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మలయాళంతోపాటు తమిళంలోనూ ఆఫర్స్ అందుకుంది. రజినీతో కలిసి పేట సినిమాతో పరిచయమైంది.
ఆ తర్వాత విజయ్ దళపతి సరసన మాస్టర్ చిత్రంలో కనిపించింది. అలాగే తమిళ్ స్టార్ హీరో ధనుష్ జోడిగా మారన్ చిత్రంలో నటించింది.
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తమిళంలో మాళవిక నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్