03 July 2025

చైల్డ్ ఆర్టిస్టుగా సక్సెస్.. హీరోయిన్‏గా అట్టర్ ప్లాప్.. ఆఫర్స్ నిల్

Rajitha Chanti

Pic credit - Instagram

చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో సీరియల్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్‏గా సరైన క్రేజ్ అందుకోలేకపోయింది.

సీరియల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చినప్పటికీ హీరోయిన్‏గా సక్సెస్ కాలేకపోయింది. అటు నిర్మాతగాను ఈ బ్యూటీకి అంతగా కలిసి రాలేదు. 

దీంతో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ వయ్యారి. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తనే అవికా గోర్. 

హిందీలో బాలిక వధు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆనంది పాత్రతో అమాయకమైన నటనతో పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయ్యింది. 

ఈ సీరియల్ తర్వాత హిందీలో మరిన్ని సీరియల్స్ చేసింది. ఆ తర్వాత ఉయ్యాల జంపాలా సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. 

మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ నటిగా మెప్పించింది. 

 కానీ ఈ బ్యూటీకి సరైన క్రేజ్ మాత్రం రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా మారినప్పటికీ పలు సినిమాలు నిర్మించినా సక్సెస్ రాలేదు.