22 October 2025

సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని డిమాండ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ హావా

Rajitha Chanti

Pic credit - Instagram

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ గురించి మీకు తెలుసా..? 42 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 

ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?. దాదాపు 25 ఏళ్లుగా సినిమాల్లో అందం, అభినయంతో అలరిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ చెక్కు చెదరని గ్లామర్‏తో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తుంది.

ఆమె మరెవరో కాదండి.. అందాల అప్సరస త్రిష. 1983 మే 4న తమిళనాడులోని చెన్నైలో జన్మించిన త్రిష.. గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసింది ఈ వయ్యారి. 

2001లో మిస్ ఇండియాలో బ్యూటీఫుల్ స్మైల్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత సిమ్రాన్, ప్రశాంత్ జంటగా నటించిన జోడీ సినిమాలో చిన్న పాత్ర పోషించి సినీరంగంలోకి అడుగుపెట్టింది

ఆ తర్వాత నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకుంది.

ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తుంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన  ఈ అమ్మడు.. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి ఫుల్ బిజీ అయ్యింది.

ఇప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. అలాగే 42 ఏళ్ల వయసులోనూ ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది.

అలాగే నివేదికల ప్రకారం త్రిష ఆస్తులు రూ.120 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఈ బ్యూటీ వద్ద  బెంజ్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని టాక్.