25 January 2025
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా చేతిలో 6 సినిమాలు..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో హీరోయిన్లకు సక్సెస్‌లు, ప్లాప్‌లు సర్వసాధారణం. కానీ ఈ హీరోయిన్‌కు వరుసగా ప్లాప్స్ వచ్చిన చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి.
పదేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్ని ప్లాప్ అయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరంటే.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ జబ్ వి మెట్ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ ప్రారంభించిన వామికా గబ్బి. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.
2015లో వచ్చిన సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వామికా గబ్బి.
కానీ ఈ సినిమాతో అంతగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటించింది.అలాగే ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేసింది.
ఇటీవలే వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన బేబీ జాన్ చిత్రంలోనూ కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా సైతం డిజాస్టర్ అయ్యింది.
వరుస సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం ఆఫర్స్ తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఏకంగా ఆరు సినిమాల్లో నటిస్తుంది.
అడవి శేష్ సరసన గూఢచారి 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్