12 November 2025
డబ్బులు లేక చదువు మానేసింది.. ఇప్పుడు ఒక్కో సినిమాకు 10 కోట్లు..
Rajitha Chanti
Pic credit - Instagram
ఆమె దక్షిణాదిలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. తక్కువ కాలంలోనే సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటుతుంది.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అగ్ర హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.
అయితే ఒకప్పుడు డబ్బులు లేక చదువు మధ్యలోనే మానేసింది. ఇప్పుడు కేవలం 3 నిమిషాల పాటకు రూ.5 కోట్లు పారితోషికం తీసుకోవడం హాట్ టాపిక్.
అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఆమె మరెవరో కాదు.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్ అయిన సమంత.
సమంత గత 15 సంవత్సరాలుగా నటనా రంగంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సూర్య హీరోలతో నటించింది.
కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది.
కొన్నాళ్ల క్రితం ఆమె మయోసిటిస్ సమస్యతో పోరాడింది. సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కొన్ని సంవత్సరాలు సినిమాలకు విరామం తీసుకుంది.
ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. అలాగే శుభం సినిమాతో నిర్మాతగా మారింది. ఇప్పుడు సామ్ బిజీగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్