నెట్టింట గత్తరలేపుతోన్న చైల్డ్ ఆర్టిస్ట్.. ఆఫర్స్ కోసం ఎదురుచూపులు..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినీప్రియులకు దగ్గరైంది. తెలుగుతోపాటు మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో బాలనటిగా కనిపించింది ఈ అమ్మడు.
కానీ ఇప్పుడు హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారును కునుకు లేకుండా చేస్తుంది. ఎవరంటే..
తనే ఎస్తర్ అనిల్.. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించింది. అంతకు ముందు మలయాళంలో పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది.
దృశ్యం సినిమాతో తెలుగులో పాపులర్ అయిన ఎస్తర్ అనిల్.. ఇప్పుడు మాత్రం నెట్టింట గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. హీరోయిన్గా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.
అయితే ఇప్పటికే పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది ఎస్తర్. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అటు ఇండస్ట్రీలో అవకాశాలు సైతం రావడం లేదు.
సౌత్ ఇండస్ట్రీలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ హీటెక్కిస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన క్రేజీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అటు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఎస్తర్ అనిల్.. 2010లో నల్లపన్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత దృశ్యం సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాపులర్ అయ్యింది.