05 September 2025

ఫస్ట్ మూవీ డిజాస్టర్.. అయినా తగ్గని ఆఫర్స్.. కుర్రాళ్ల కలల రాణి..

Rajitha Chanti

Pic credit - Instagram

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. పలు బ్రాండ్లకు అంబాసిడర్‏గా వ్యవహరించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్‏గా మారింది.

ప్రకటనలలో నటిస్తుండగానే హిందీలో సినిమా ఆఫర్ వచ్చింది. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. మరో రెండు సినిమాల్లో నటించింది. 

ఇక తెలుగులో ఓ స్టార్ హీరోతో జతకట్టింది. కానీ ఈ అమ్మడు నటించిన ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినా ఆఫర్స్ క్యూ కట్టాయి. 

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి భాగ్య శ్రీ బోర్సే. 

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కింగ్ డమ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్. 

ప్రస్తుతం రామ్ పోతినేని సరసన నటిస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన్ మూవీలో కనిపించనుంది. ఇవే కాకుండా సూర్య సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. 

తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి అటు తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. దీంతో ఆమె పేరు మారుమోగుతుంది. 

అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్ల హృదయాలను దొచేస్తుంది ఈ ముద్దుగుమ్మ.