ఒక్కో సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ఇప్పుడేమో ఆ స్టార్ హీరోతో..

15 March 2025

ఒక్కో సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ఇప్పుడేమో ఆ స్టార్ హీరోతో..

Rajitha Chanti

Pic credit - Instagram

image

సాధారణంగా సినీరంగంలో స్టార్ హీరోలకు మాత్రమే భారీ రెమ్యునరేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ హీరోయిన్లకు తక్కువగా పారితోషికం ఇస్తారు. 

కానీ మీకు తెలుసా.. ఓ హీరోయిన్ మాత్రం స్టార్ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకుంటుంది. ఒక్కో సినిమాకు రూ.40 కోట్లు వసూలు చేసింది. 

ఆమె మరెవరో కాదు.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అందాల తార గురించి చెప్పక్కర్లేదు. 

రిపోర్ట్స్ ప్రకారం ప్రియాంక చోప్రా రూ.40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. అయితే ఇంత డబ్బు కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే తీసుకుంటుందట. 

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక.. ఒక్కో సినిమాకు 5 మిలియన్ డాలర్స్ తీసుకుంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.40 కోట్లు. 

ఇటీవలే వచ్చిన సిటాడెల్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం ఆమె ఈ రేంజ్ పారితోషికం తీసుకున్నట్లు టాక్. అంతకు ముందు ప్రతి సినిమాకు రూ.20 కోట్లు తీసుకుంది. 

 ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే దీపికా పదుకొణే. ఒక్కో సినిమాకు రూ. 30 కోట్లు తీసుకుంటుందట. 

ప్రస్తుతం ప్రియాంక చోప్రా తెలుగులో ఓ సినిమా చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB29లో నటిస్తుంది.