10 March 2025

5 సినిమాలు చేస్తే రెండే హిట్టు.. స్పెషల్ పాటతో గత్తరలేపింది..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుని కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది.

అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ చిన్నది.. ఫస్ట్ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ అయిపోయింది.

తెలుగులో మొత్తం 5 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. అటు స్పెషల్ పాటలతోనూ నెట్టింట గత్తరలేపుతోంది. 

ఆమె మరెవరో కాదు.. జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తెలుగులో ఆమెకు విపరీతమైన క్రేజ్. 

తెలుగులో జాతిరత్నాలు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలరా 2 చిత్రాల్లో నటించి మెప్పించింది. 

హీరోయిన్ గా మొత్తం 5 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. కానీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 

నెట్టింట గ్లామర్ డోస్ పెంచేసి కుర్రాళ్లను ఆగం చేస్తుంది ఈ వయ్యారి. వరుసగా మోడ్రన్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 

ఇప్పుడు తెలుగులో సరైన బ్రేక్ ఎదురుచూస్తుంది ఫరియా. అలాగే తనకు వచ్చే ఆఫర్స్ విషయంలో అచి తుచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.