07 December 2024

15 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. 100కు పైగా సినిమాలు.. ఇప్పుడు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టీనేజ్‏లోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‏గా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన హీరోయిన్. తనే రంభ.

1992లో సీనియర్ హీరో వినీత్ జోడిగా స్వర్గం సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ రంభ. అప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు మాత్రమే. 

ఆ తర్వాత 1993లో ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. 

మెగాస్టార్ చిరంజీవి సరసన బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, అల్లుడా మాజాకా, అల్లరి ప్రేమికుడు వంటి చిత్రాల్లో నటించింది.

అలాగే బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అల్లు అర్జున్ నటించిన దేశముదురులోనూ స్పెషల్ సాంగ్ చేసింది రంభ. 

చివరిసారిగా పెన్ సింగం చిత్రంలో నటించింది. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. 

ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్టూ చేస్తుంటుంది రంభ.