02 July 2025
చేసిందే మూడు సినిమాలు.. అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే.. ఆస్తులు చూస్తే
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో చేసిందే మూడు సినిమాలు.. కట్ చేస్తే.. అన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లే. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ వయ్యారి.
ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో కనిపించింది.
మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్న మూవీతో మరో హిట్టు అందుకుంది.
ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ జోడిగా ఫ్యామిలీ స్టార్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత మరో సినిమా చేయేలేదు.
కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది మృణాల్. ప్రస్తుతం అడివి శేష్ నటిస్తోన్న డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. హిందీలో ఎక్కువగా ఫోకస్ చేసింది.
నివేదికల ప్రకారం మృణాల్ ఆస్తులు రూ.33 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. సినిమాలతోపాటు ప్రకటనలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, బిజినెస్ ద్వారా సంపాదిస్తుంది.
1992 ఆగస్ట్ 1న మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో జన్మించింది మృణాల్. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాల్లోకి వచ్చింది.
మొదట్లో సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. హిందీలో సూపర్ హిట్ అయిన కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్