12 సినిమాలు చేస్తే రెండే హిట్స్.. అయినా తగ్గని ఆఫర్స్.. క్రేజ్ పీక్స్
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కథానాయికగా 12 సినిమాలు చేస్తే అందులో కేవలం రెండు మాత్రమే సూపర్ హిట్ కాగా.. మిగిలినవన్నీ ప్లాప్ అయ్యాయి.
అయినా ఈ చిన్నదాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ ఎవరంటే.
ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ శ్రీలీల. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.
దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆమె డ్యాన్స్ ఎనర్జీ చూసి షాకయ్యారు. ఒక్కఏడాదిలోనే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.
కానీ ఆమె నటించిన చిత్రాల్లో కేవలం రెండు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మిగిలిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఇండస్ట్రీలో శ్రీలీల క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా బీటౌన్ ఛాన్స్ కొట్టేసింది.
ఇప్పుడు హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న అషీకి సీక్వెల్లో నటిస్తుంది. ఈ సినిమాతోనే హిందీలోకి తెరంగేట్రం చేస్తుంది. మరోవైపు హిందీలో మరో క్రేజీ ఛాన్స్ వచ్చిందట.
అలాగే ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక తమిళం, ఒక హిందీ, తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఇవే కాకుండా ఇప్పుడిప్పుడే హిందీలో ఆఫర్స్ వస్తున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న శ్రీలీల నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ నెట్టింట అభిమానులను ఆక్టటుకుంటున్నాయి