12 November 2025
9 సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. ప్రభాస్, పవన్ కళ్యాణ్‌తో ఆఫర్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హిట్టు కొట్టాల్సిందే.
అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ హిట్టు కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా అంతే.
ఆమె మరెవరో కాదు నిధి అగర్వాల్. 'మున్నా మైఖేల్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఆ తర్వాత నాగచైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ సైతం నిరాశే మిగిల్చింది. కానీ తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.
మిస్టర్ మజ్ను, భూమి, హీరో వంటి సినిమాలతో అలరించినప్పటికీ అంతగా మెప్పించలేకపోయాయి. రామ్ పోతినేతితో చేసిన ఇస్మార్ట్ శంకర్ హిట్టైంది.
నిధి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టు ఈ మూవీ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు సినిమాలో నటించింది. ఇటీవలే ఈ మూవీ విడుదలైంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. అంతేకాదు.. తెలుగులో నిధి అగర్వాల్ కు స్టార్ హీరోలతో ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజాసాబ్ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్