25 September 2025
గ్లామర్ ప్రపంచానికి యువరాణి.. స్పెషల్ పాటలకు భారీగా డిమాండ్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా దూసుకుపోతున్న హీరోయిన్ ఆమె. నటనపై ఆసక్తితో కెనడా నుంచి ముంబై వచ్చి సినిమాల్లో సెటిల్ అయ్యింది.
కేవలం 5 వేలతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు 5 నిమిషాల పాటకు రూ. 2 నుంచి రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటుంది.
కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడిన ఈ సుందరి.. ఇప్పుడు మాత్రం గ్లామర్ ప్రపంచంలో యువరాణిగా ఓ వెలుగు వెలుగుతుంది.
ఆమె బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక పాటలలో నటించింది. ఒక్కో పాటకు ఇప్పుడు 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది.
ఒకప్పుడు అవకాశాల కోసం ప్రయత్నిస్తూ గుడ్డు, బెడ్డుతో మాత్రమే కడుపు నింపుకుందట. అలాగే కొందరు అవకాశాల ఇచ్చి డబ్బులు ఇవ్వలేదట.
నివేదికల ప్రకారం నోరా ఫతేహి ఆస్తులు రూ.60 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అలాగే ఆమె పలు వ్యాపార సంస్థలలో భారీగా పెట్టుబడులు పెట్టిందట.
ఇప్పుడు నోరా ఫతేహి హిందీలో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తోపాటు ప్రైవేట్ ఆల్బమ్స్ సైతం చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
నిత్యం గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్న నోరా ఇటు నెట్టింట యాక్టివ్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్