13 November 2025

3 నిమిషాలు నటిస్తే రూ.6 కోట్లు.. ఈ బ్యూటీ రేంజ్ మాములుగా లేదుగా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పింది. తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.

కేవలం 3 నిమిషాల పాటకు దాదాపు 6 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక పాటలతో చక్రం తిప్పుతుంది.

ఆమె మరెవరో కాదండి హీరోయిన్ తమన్నా భాటియా. ఇప్పటికే సినిమాల్లో తన గ్లామర్, ఎనర్జీ, స్టైల్, యాక్టింగ్ తో సినీప్రియులను కట్టిపడేసింది ఈ అమ్మడు.

ప్రస్తుతం స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. స్టైలీష్ స్టెప్పులతో ఆకట్టుకుంటుంది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ చిత్రం తెరకెక్కించారు.

ఈ సిరీస్ నెట్ ఫ్లిక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇందులో తమన్నా గఫూర్ అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఎప్పటిలాగే తన స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది.

కేవలం 3 నిమిషాలు ఉండే ఈ పాట కోసం తమన్నా ఏకంగా రూ.6 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట. ఇండస్ట్రీలో ఇదో చర్చనీయాంశంగా మారింది.

చాలా కాలంగా తెలుగు సినిమాలు తగ్గించేసింది తమన్నా. చివరగా మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటించగా.. ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. 

ప్రస్తుతం తెలుగు, తమిలం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ స్పెషల్ సాంగ్స్ చేస్తూ రచ్చ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.