09 February 2025
10 రోజులకు రూ.9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. హిందీతోపాటు తెలుగులోనూ నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించిన ఆమె.. ఒక తెలుగు సినిమా సినిమాకు పది రోజులకు ఏకంగా రూ.9 కోట్లు పారితోషికం తీసుకుంది.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారు.. ? తనే హీరోయిన్ అలియా భట్. తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.
డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన అలియా.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది.
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
అయితే డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో చరణ్, ఎన్టీఆర్ నటించారు.
అయితే ఈ సినిమాకు కేవలం పది రోజులు మాత్రమే వర్క్ చేసిందట అలియా. ఆ పది రోజులకు గానూ ఆమె ఏకంగా రూ.9 కోట్లు తీసుకుందట.
అంటే ఒక్కో రోజుకు రూ.కోటి వరకు వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా మెప్పించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్