17 January 2025

గంటకు రూ.15 లక్షల రెమ్యునరేషన్.. ఈ బ్యూటీ రేంజే వేరప్పా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే స్టార్ డమ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 

ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో హిట్స్ కొట్టిన ఈ చిన్నది.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఆమె ఎవరంటే.. 

ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కోసం గంటకు రూ.15 లక్షలు పారితోషికం తీసుకుంటుందట. ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ?

ఆ బ్యూటీ మరెవరో కాదు.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. 

 కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

మొదట్లో రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ చేసేందుకు సైతం సై అంటున్నట్లు తెలిపింది. 

అలాగే షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఈ ముద్దుగుమ్మ గంటకు రూ.15 లక్షలు పారితోషికం తీసుకుంటుందని ఫీల్మ్ వర్గాల్లో టాక్.