05 February 2025

ఒక్క హిట్ లేదు.. కానీ 1 నిమిషానికి రూ.1 కోటి తీసుకుంటున్న హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం ఆ హీరోయిన్. ఇటీవలే ఆమె స్పెషల్ సాంగ్ చేసిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఈ సినిమాతోపాటు ఆమెకు సైతం ఫాలోయింగ్ పెరిగిపోయింది. అలాగే చాలాసార్లు తన తీరుతో ట్రోలింగ్ బారిన పడింది ఈ బ్యూటీ. 

ఎప్పుడూ వివాదాల కారణంగానే ఆమె వార్తలలో నిలుస్తుంది. అయితే ఇప్పటికీ 1 నిమిషానికి రూ.1 కోటి పారితోషికం తీసుకుంటుంది.

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయ్యింది.

తెలుగులోనూ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ అదరగొట్టింది. ఇక ఇటీవలే ఆమె నటించిన డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. 

సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో గుర్తింపు రాలేదు.

37 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. 

ఇదిలా ఉంటే.. ఊర్విశీ ఆస్తులు రూ.236 కోట్లు. ఇటీవలే 3 నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం రూ.3 కోట్లు వసూలు చేసింది. అంటే నిమిషానికి రూ.కోటి.