11 December 2024

సినిమాల్లో వేశ్య పాత్రలలో నటించిన హీరోయిన్స్ వీళ్లే..

Rajitha Chanti

Pic credit - Instagram

కొన్ని రోజుల క్రితం పాజిటివ్ రివ్యూ అందుకున్న విమానం సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆమె నటుకు ప్రశంసలు వచ్చాయి.

అల్లు అర్జున్, మంచు మనోజ్ నటించిన వేదం సినిమాలో హీరోయిన్ అనుష్క వేశ్య పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించారు. 

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా చక్రం తిప్పిన శ్రియా శరణ్ సైతం వేశ్య పాత్రలో అలరించింది. పవిత్ర సినిమాలో వేశ్యగా కనిపించింది శ్రియా.

టాలీవుడ్ హోమ్లీ హీరోయిన్ స్నేహ కూడా వేశ్య పాత్రలో నటించిందని మీకు తెలుసా.. ? ధనుష్ నటించిన ధూల్ పేట్ సినిమాలో వేశ్య పాత్ర చేసింది. 

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ జ్యోతిలక్ష్మి. ఇందులో హీరోయిన్ ఛార్మి కెరీర్ లో మొదటిసారి వేశ్య పాత్ర పోషించింది. 

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ పంచతంత్రం. ఇందులో రమ్యకృష్ణ సైతం వేశ్య పాత్ర పోషించింది. 

ఇక స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సైతం వేశ్య పాత్రలో నటించింది. హిందీలో డి డే అనే సినిమాలో శ్రుతి హాసన్ పాకిస్తాన్ కు చెందిన వేశ్యగా కనిపించింది. 

నందమూరి హీరో బాలకృష్ణ, డైరెక్టర్ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన చిత్రం పాండురంగడు. ఇందులో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది టబు.