పుష్ప 2 మూవీలో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతో తెల్సా
07 December 2024
Ravi Kiran
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 మూవీ ఇటీవల విడుదలైంది. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా కాగా, సుకుమార్ దర్శకత్వం వహించారు.
భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ.. ఫస్ట్ డే నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఈ సినిమాలో అనసూయ, జగపతి బాబు, రావు రమేష్, ఫహద్ ఫైజల్ లాంటి కీలక నటీనటులు ఉన్నప్పటికీ.. పావని అనే అమ్మాయి క్యారెక్టర్ మాత్రం చాలా స్పెషల్.
ఈ సినిమాలో ఆమె హైలెట్‌గా నిలిచింది. అల్లు అర్జున్‌ను ఈ సినిమాలో బాబాయి అని పిలుస్తుంది పావని.
ఈ బ్యూటీ ఇప్పటికే పరేషాన్, పైలం పిలగా అనే రెండు సినిమాల్లో మెరిసింది. ఈ రెండు సినిమాలలో పావని నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ముఖ్యంగా పరేషాన్ సినిమాలో సమోసా డైలాగ్ చెప్పి బాగా పాపులర్ అయింది పావని. హిట్ 2 సినిమాలో కూడా నటించింది ఈ బ్యూటీ.
పుష్ప మొదటి భాగంలో కొంచెంసేపు కనిపించిన ఈ బ్యూటీ... రెండవ పార్ట్‌లో మాత్రం అనసూయ కంటే ఎక్కువ సీన్లలో మెరిసింది.
ఇక పుష్ప 2 సినిమాలో పావని నటించినందుకు గానూ దాదాపు రూ.50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.
ఇక్కడ క్లిక్ చేయండి