24 November 2023

నాగ చైతన్య 'తండేల్‌' టైటిల్‌కు అర్థమేంటో తెలుసా?

 కస్టడీ సినిమా తర్వాత  యువ సామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న చిత్రం తండేల్

గతంలో చైతూతో ప్రేమమ్‌, సవ్యసాచి సినిమాలు తీసిన చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మత్స్యకారుల జీవన నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ  మూవీని రూపొందిస్తున్నారు

లవ్‌ స్టోరీ సినిమా తర్వాత మరోసారి సాయి పల్లవి నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా నటిస్తోంది

తాజాగా ఈ మూవీకి టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. తండేల్‌ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఎంపిక చేశారు

తండేల్‌ అంటే కెప్టెన్‌, నాయకుడు అని అర్థం. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు