16 September 2025
వరుసగా నాలుగు ప్లాపులు.. అయినా తగ్గని ఆఫర్స్.. ఆస్తులు రూ.120 కోట్లు
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ వరుసగా 4 ప్లాపు చిత్రాలతో కెరీర్ స్టార్ట్ చేసింది.
తెలుగులో స్టార్ హీరోలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.120 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఆ వయ్యారి ఎవరంటే. ఇండస్ట్రీలో స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ తమన్నా. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ ప్రారంభంలో ఈ బ్యూటీ నటించిన నాలుగు చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ తమన్నాకు సినీరంగంలో అవకాశాలు తగ్గలేదు.
తెలుగులో మంచు మనోజ్ సరసన శ్రీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో చాంద్ షా రోషన్ చెహ్రా అనే చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది.
తమిళంలో కేడి, వియబారి చిత్రాల్లో నటించింది. అలా కెరీర్ ప్రారంభంలో వరుసగా నాలుగు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. అయినా ఆఫర్స్ అందుకుంది తమన్నా.
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ చిత్రంలో నటించింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్