30 October 2025

ఒక్కో సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. తమన్నా ఆస్తులు ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ తమన్నా. ఇప్పుడు ఈ బ్యూటీ హిందీలో స్పెషల్ పాటలతో దూసుకుపోతుంది.

కొన్నాళ్లుగా తెలుగులో సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు.. ప్రస్తుతం హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అలాగే స్పెషల్ పాటలతో ఇండస్ట్రీలో రచ్చ చేస్తుంది.

ఇటీవల ఆజ్ కీ రాత్ స్పెషల్ పాటతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. దీంతో హిందీలో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇంతకీ తమన్నా ఆస్తులు తెలుసా.. 

నివేదికల ప్రకారం.. 2023లో తమన్నా ఆస్తులు రూ.111 కోట్ల నుంచి 2024లో రూ.120 కోట్లకు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే ఆస్తులు రూ.10 కోట్లు పెరిగిందట. 

అలాగే ముంబైలోని వెర్సోవాలో ఖరీదైన ఇంటిని కలిగి ఉంది. అంధేరి వెస్ట్‏లోని లోఖండ్ వాలలో రూ.7.84 కోట్ల విలువైన మూడు లగ్జరీ అపా‏ర్ట్మెంట్స్ ఉన్నాయట.

తమన్నా దగ్గర BMW 320i (రూ. 43.50 లక్షలు), మెర్సిడెస్-బెంజ్ GLE (రూ. 1.02 కోట్లు), మిత్సుబిషి పజెరో స్పోర్ట్ (రూ. 29.96 లక్షలు) కార్లు ఉన్నాయి. 

అలాగే ఇటీవల మైసూర్ శాండర్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు రూ.6.2 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఎన్నో బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది.

ఐపీఎల్ వేడుకలలో తమన్నా స్టేజ్ ప్రదర్శనకు కేవలం 10 నిమిషాల డ్యాన్స్ కోసం రూ.50 లక్షలు.. ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట.