25 August 2025
హీరోయిన్‌గా శ్రీముఖి.. విడుదల కాకుండానే ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలతో బిజీగా ఉంటుంది యాంకర్ శ్రీముఖి. ఇప్పుడు తెలుగులో బిజీ యాంకర్లలో ఒకరిగా మారింది ఈ ముద్దుగుమ్మ.
ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. కానీ ఆమె ఎక్కువగా బుల్లితెరపై యాంకర్ షో అవకాశాలే అందుకుంది. అటు హీరోయిన్ గానూ చేసింది.
ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయికగా మారింది. అలాగే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలోనూ మెయిన్ లీడ్ రోల్ పోషించింది ఈ అందాల యాంకరమ్మ.
కథానాయికగా పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. కానీ శ్రీముఖి నటించిన ఓ సినిమా విడుదల కాలేదని మీకు తెలుసా.. ?
శ్రీముఖి హీరోయిన్‌గా చేసిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. నటుడు హర్షవర్దన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మురళీ కృష్ణ హీరోగా నటించారు.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా.. ప్రమోషన్స్, ప్రెస్ మీట్స్ కూడా నిర్వహించారు. కానీ అనుహ్యంగా ఈ మూవీ ఆర్థిక సమస్యలతో విడుదల కాలేదు.
లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా చివరకు అడియన్స్ ముందుకు మాత్రం రాలేదు. ఇందులో శ్రీముఖిది చాలా బలమైన పాత్ర.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్