06 December 2024

ఒక్క పాటకు 25 లక్షలు, 185 కోట్ల ఆస్తులు.. ఇండస్ట్రీలోనే రిచ్ సింగర్

Rajitha Chanti

Pic credit - Instagram

ఆమె పన్నెండేళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించి ఇప్పటివరకు దాదాపు 25000లకు పైగా పాటలు పాడి శ్రోతల హృదయాలను గెలుచుకుంది. 

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాళీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది. తను మరెవరో కాదు.. సింగర్ శ్రేయా ఘోషల్. 

ఆమె గాత్రానికి.. సున్నిత ప్రవర్తనకు.. అందమైన చిరునవ్వుకు ఎంతో మంది అభిమానులు ఉన్నాయి. తన అద్భుతమైన గాత్రంతో మెస్మరైజ్ చేసింది. 

నివేదికల ప్రకారం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్ శ్రేయా ఘోషల్. సినీ పరిశ్రమలో ఆమె రిచ్ సింగర్ అని మీకు తెలుసా. 

ఆమె ఆస్తులు రూ.185 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాదు.. ఏ భాషలలోనైనా ఒక్క పాటకు దాదాపు రూ.25 లక్షలు తీసుకుంటుందట. 

అయితే దీనిపై సరైన క్లారిటీ లేదు. చిన్న వయసులోనే సరిగమప రియాల్టీ షో ద్వారా గాయనిగా ప్రయాణం స్టార్ట్ చేసింది సింగర్ శ్రేయా ఘోషల్.

16 ఏళ్ల వయసులోనే ఈ సింగింగ్ షో విజేతగా నిలిచింది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించిన దేవదాసు సినిమాతో ఫస్ట్ సాంగ్ పాడింది. 

ఇక ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. 16 ఏళ్ల వయసులో మొదలైన సినీప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.