06 September 2025

17 ఏళ్లకే బాడీ షేమింగ్.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో చక్రం తిప్పింది.. 

Rajitha Chanti

Pic credit - Instagram

 చిన్న వయసులోనే సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొందట ఈ ముద్దుగుమ్మ. 

17 ఏళ్ల వయసులోనే బాడీ షేమింగ్ విమర్శలు రావడంతో ఎంతో బాధపడిందట. అయినా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేసింది. 

నల్లగా, సన్నగా, పొడవుగా ఉన్నానని తనను కామెంట్స్ చేశారని.. కానీ నటనపై ఆసక్తితో అవకాశం  కోసం ఎదురుచూసినట్లు తెలిపింది. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శిల్పా శెట్టి. ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోతో తాను ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని చెప్పుకొచ్చారు. 

సినీరంగంలోకి అడుగుపెట్టినప్పుడు తనకు 17 ఏళ్లు మాత్రమే అని.. ఆ సమయంలో తాను ప్రపంచాన్ని చూడలేదని, జీవితాన్ని అర్థం చేసుకోలేదట. 

తొలినాళ్లల్లో కెమెరా ముందు నిలబడటానికి భయంగా ఉండేదని.. కొన్ని సినిమాల తర్వాత తన కెరీర్ ముగిసిపోతుందని భయపడిందట. 

శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్నారు. వారికి వియాన్, షమిషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెట్టింట చాలా యాక్టివ్. 

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో శిల్పా ఒకరు. ఆమె ఆస్తులు రూ.130 కోట్లు. సొంతంగా జెట్ కూడా ఉంది.