17 September 2025

రెండేళ్లుగా సినిమాలకు దూరం.. సమంత ఆస్తులు ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలతో చక్రం తిప్పింది. 

కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. చివరగా సిటాడెల్, ఖుషి చిత్రాల్లో కనిపించింది సామ్.

ఇటీవలే నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. నివేదికల ప్రకారం సమంత ఆస్తుల విలువ రూ.110 కోట్లు ఉన్నాయని సమాచారం.

ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఏడాదికి రూ.8 కోట్లు తీసుకుంటుంది. 

సమంత వద్ద ఆడి Q7, పోర్స్చే కేమన్ GTS, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ G63 AMG, BMW 7 సిరీస్ వంటి కార్లు ఉన్నాయి.

సమంత స్త్రీ ఆరోగ్య సంరక్షణ బ్రాండ్ అయిన ZOYని సహ-స్థాపించారు. వ్యాపారరంగంలోఅనేక పెట్టుబడులు పెట్టింది సామ్.

2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సామ్.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ