22 September 2024

సమంత నెట్ వర్త్ ఎంత ఉంటుందో తెలుసా..? కార్ కలెక్షన్ చూస్తే షాకే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ సమంత. 

ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సామ్ అందం, అభినయంతో వెండి తెరపై తనదైన మాయ చేసింది. 

తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోని స్టార్ హీరోస్ అందరి సరసన స్క్రీన్ షేర్ చేసుకున్న సామ్ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. 

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తుందని.. వెబ్ సిరీస్ ఓకే చేసిందని టాక్. 

దశాబ్దంపాటు సినీరంగంలో అగ్రకథానాయికగా కొనసాగిన సమంత.. ఇప్పటివరకు దాదాపు రూ.115 కోట్లకు పైగానే సంపాదించిందట. 

అలాగే ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని.. నటనతోపాటు బ్రాండ్స్, ప్రకటనల ద్వారా సంపాదిస్తుందట. 

 ప్రస్తుతం సామ్ వద్ద రూ. 2.26 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ నుంచి పోర్షే కేమాన్ జిటిఎస్ వరకు లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది.

పోర్షే కేమాన్ GTS (1.46 కోట్లు), జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ (72 లక్షలు), Mercedes Benz G63 AMG(3.30 కోట్లు), ఆడి క్యూ7 (87 లక్షలు).