సహజ సౌందర్యం.. సాయి పల్లవి ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఇవే..
Rajitha Chanti
Pic credit - Instagram
న్యాచురల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈబ్యూటీ.
ఇటీవలే తండేల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది. హిందీలో ఆమెకు ఇదే మొదటి సినిమా.
ఇదిలా ఉంటే... సినిమాల్లో సాయి పల్లవి తక్కువగా మేకప్ వేసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బ్యూటీ టిప్స్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
తాను ఎక్కువగా సమతుల్య ఆహారం తీసుకుంటానని.. చాలా పండ్లు, కూరగాయలు, గింజలు మాత్రమే తీసుకుంటుందట. అలాగే ప్రతిరోజూ పలు రకాల వ్యాయమాలు చేస్తుందట.
చర్మాన్ని రోజంతా హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎక్కువగా నీరు తాగుతుందట. అలాగే సెట్స్ లో ఎక్కువగా కొబ్బరి నీరు తీసుకుంటానని..చర్మం ప్రకాశవంతంగా ఉంటుదట.
అలాగే తన జుట్టు కోసం సింథటిక్ రసాయనాలు ఉండే ఉత్పత్తులను ఉపయోగించనని.. సహజ సిద్ధమైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తానని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.
తాను తక్కువగా మేకప్ వేసుకుంటానని.. కేవలం సన్ స్క్రిన్, మాయిశ్చరైజర్ మాత్రమే ఉపయోగిస్తానని తెలిపింది. ముఖం మీద మొటిమల కారణంగా అభద్రతా భావం ఉంటుందట.
అలాగే తన జుట్టుకు ఎక్కువగా కలబంద వంటి సహజ ఉత్పత్తులను ఉపయోగిస్తానని తెలిపింది. ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో వరుస అవకాశాలు అందుకుంటుంది.