25 February 2025
మూడేళ్లల్లో మూడు బ్లాక్ బస్టర్స్.. రూ.3వేల కోట్లు రాబట్టిన హీరోయిన్
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో జోరు కొనసాగిస్తుంది ఈ హీరోయిన్. తెలుగు, హిందీ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
మూడేళ్లలో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఆమె నటించిన మూడు చిత్రాలు మొత్తంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు స్టార్ హీరోలకు అదృష్ట దేవతగా మారింది ఈ అమ్మడు. ఈ పాన్ ఇండియా బ్యూటీ ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా
ఇప్పుడు రష్మిక అంటే ఓ బ్రాండ్ గా మారింది. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన నటించింది. ఈ మూవీ రూ. 900 కోట్లు వసూలు చేసింది
ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2తో మరో హిట్ అందుకుంది. ఈ మూవీ రూ.1800 కోట్లకు పైగా రాబట్టింది.
ఇక ఆ తర్వాత ఇటీవల రిలీజ్ అయిన ఛావా మూవీతో మరో కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు. ఇందులో ఏసుబాయి పాత్రలో నటిగా ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరుస విజయాలతో విక్కీ కౌశల్ కు క్రేజ్ కలిసొచ్చింది.
ఇలా వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. మొత్తం మూడేళ్లలో రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది రష్మిక మందన్నా.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్