03 February 2025
ఆ బ్లాక్ బస్టర్ హిట్స్ మిస్ చేసుకున్న రష్మిక.. చేసి ఉంటే మరోలా ఉండేది
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.
గతేడాది యానిమల్, పుష్ప 2 వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో తెలుగు, హిందీ సినిమాలు దాదాపు 6 ఉన్నాయి.
ప్రస్తుతం ఛావా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఇటీవలే జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ గాయపడిన రష్మిక.. వీల్ చైర్ లో ఈవెంట్లలో పాల్గొంటుంది.
ఇదిలా ఉంటే.. రష్మిక కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ రిజెక్ట్ చేసిందన్న సంగతి తెలుసా.. దాదాపు ఆమె ఆరు పెద్ద సినిమా ఆఫర్స్ వదిలేసిందని సమాచారం.
డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలీ రణదీప్ హుడాతో కలిసి చేసే ఓ సినిమా కోసం రష్మికను ఎంపిక చేశారు. కానీ ఆఫర్ వదిలేసిందంట ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, దళపతి విజయ్ మాస్టర్ సినిమా, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జోడిగా జెర్సీ సినిమా ఆఫర్స్ వదిలేసిందట
అలాగే దళపతి విజయ్ గోట్ బీస్ట్, బీటౌన్ హీరో కార్తిక్ ఆర్యన్ కిరిక్ పార్టీ మూవీ రీమేక్ చిత్రాల్లో ముందుగా రష్మికకు ఆఫర్స్ రాగా వదలేసిందని టాక్.
ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ జోడిగా సికిందర్ సినిమాలో నటిస్తుంది. అలాగే కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్